ప్రముఖ టాలీవుడ్ హీరో, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. సైబరాబాద్ కమిషనరేట్ రాయదుర్గం పరిధి ఐకియా స్టోర్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సాయిధరమ్ తేజ కుడి కంటి పైభాగంతో పాటు ఛాతీ భాగంలో గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతునన సాయతేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కాలర్ బోన్ విరిగిందని శరీరంలోని అంతర్గతంగా గాయాలేవీ లేవని ఆసుపత్రి వైద్యులు వెల్లడిరచారు. ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాలిసన పని లేదని ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతందని మరో 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు.