Skip to main content

Namaste NRI

యాక్షన్‌ అడ్వైంచర్‌ థ్రిల్లర్‌… ఎన్త్‌ అవర్‌

విశ్వ కార్తికేయ, రిషికా కపూర్‌ జంటగా లేడి లయన్‌ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ఎన్త్‌ అవర్‌. రాజు గుడిగంట్ల నిర్మాత. ఆనంద్‌ కొలగాని దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాతలు ఏఎం రత్నం, అచ్చి రెడ్డి, బెక్కెం వేణుగోపాల్‌ తదితరులు అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తం సన్నివేశానికి నిర్మాత కె.ఎల్‌. దామోదర్‌ ప్రసాద్‌ క్లాప్‌నిచ్చారు. నిర్మాత బెక్కం వేణుగోపాల్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. దర్శకుడు యస్‌.వి.కృష్ణారెడ్డి గౌరవ  దర్శకత్వం వహించారు. నిర్మాత ఎం.ఎం. రత్నం పోస్టర్‌ని విడుదల చేశారు.

                ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ టైటిల్‌ ఎంత డిఫరెంట్‌గా ఉందో కథ కూడా అంతే వైవిధ్యంగా ఉంటుంది. వచ్చే నెల నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభిస్తాం అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ కథలో అనూహ్యమైన ఘటనలు ఉంటాయి. ఎప్పుడు ఏం జరుగుతుందా అన్నట్లు కథనం సాగుతుంది. అటవీ నేపథ్యంలో అడ్వెంచర్‌ థ్రిల్లర్‌గా సినిమాను రూపొందించబోతున్నాం అన్నారు. అర్జున్‌ అంబటి, భద్రం కిర్రాక్‌ సీత, వాసూ ఇంటూరి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: చెంచు.జె, సంగీతం : శశాంక్‌ ఆలమూరు, మహా, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: నాదెండ్ల సురేష్‌ బాబు, సీఈఓ: ఎ.లక్ష్మీ ప్రియాంక.

Social Share Spread Message

Latest News