Namaste NRI

తప్పుడు సమాచారం ఇస్తే.. అతనిపై చర్యలు చర్యలు : ట్రంప్

అమెరికా అధ్యక్షునిగా తాను మళ్లీ అధికారం లోకి వస్తే బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్‌హ్యారీపై అవస రమైతే తగిన చర్యలు తీసుకొంటానని రిపబ్లికన్ అభ్యర్థిత్వ రేసులో ఉన్న ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా వీసా పొందే సమయంలో సదరు దరఖాస్తుదారుకి గతంలో మాదక ద్రవ్యాలు వినియోగించిన చరిత్ర ఉంటే వెల్లడిం చాలి. ఆ సమాచారం ఆధారం గానే వీసా ఇచ్చేది లేనిది నిర్ణయించే అవకాశం ఉంటుంది. ఎవరైనా ఈ విషయంలో తప్పుడు సమాచారం ఇస్తే వారికి భారీగా జరిమానా విధించడం లేదా తిరిగి వెనక్కు పంపే అధికారం అమెరికాకు ఉంటుంది. ప్రిన్స్ హ్యారీ 2020 నుంచి అమెరికా లోని కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్నాడు.

అతడు స్పేర్ అనే పుస్తకం రాశాడు. గతంలోమాదక ద్రవ్యాలు వాడినట్టు పేర్కొన్నాడు. ఈ అంశంపై హెరిటేజ్ ఫౌండేషన్ అనే సంస్థ అతడి ఇమ్మిగ్రేషన్ రికార్డులు చూపించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ ప్రిన్స్‌హ్యారీ వీసా దరఖాస్తును కోర్టులో ఇవ్వాలని పేర్కొన్నారు. తాజాగా ఈ అంశం వివాదాస్పదంగా మారింది. ఈ అంశాన్ని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తావిస్తూ  ఒకవేళ మీరు ఎన్నికల్లో గెలిస్తే ప్రిన్స్‌కి ఏమైనా ప్రత్యేక రక్షణ లభిస్తుందా ? అని అడిగారు. దీనికి ట్రంప్ స్పందించి పై విధంగా వ్యాఖ్యానించారు. అతడు తప్పుడు సమాచారం ఇచ్చినట్టు తేలితే తగిన చర్యలు తీసుకొంటాం అని పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UULmVdT0LRtF67ZbuX2dEeQQ&layout=gallery[/embedyt]