భారతీయ చిన్నారులను ప్రవాస భారతీయులు (ఎన్నారైలు), విదేశీయులు దత్తత తీసుకునే ప్రక్రియను (ఇంటర్‌కంట్రీ అడాప్షన్లు) సులభతరం చేస్తూ సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (కారా) కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. హిందూ దత్తత, నిర్వహణ చట్టం (హామా) కింద వీటిని తీసుకొచ్చినట్టు వెల్లడిరచింది. భారతీయ చిన్నారులను ఎన్నారైలు, ఓసీఐలు (ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియన్లు) దత్తత తీసుకోవాలంటే కోర్టు నుంచి ఎన్వోసీ ధ్రువపత్రం తప్పనిసరి. అయితే దీన్ని పొందాలంటే ఎక్కువ సమయం పట్టేది. ఈ క్రమంలో ఎన్వోసీ సర్టిఫికెట్లు జారీ అధికారాన్ని కలెక్టర్లకు ఇస్తున్నట్టు కారా తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది. చిన్నారిని దత్తత తీసుకొని రెండేండ్లు పూర్తికాకుండానే విదేశాలకు వెళ్లాలనుకునే పేరెంట్స్ ఆ విషయాన్ని రెండు వారాల ముందుగానే భారత దౌత్య కార్యాలయాల్లో తెలియజేయాలని సూచించింది. చిన్నారి సొంత రాష్ట్రానికి చెందినవారికి దత్తత ప్రక్రియలో ప్రాధాన్యం కల్పించాలని పేర్కొంది.