Skip to main content

Namaste NRI

రెండేండ్ల తర్వాత.. ప్రారంభమైన అమర్‌నాథ్‌ యాత్ర

రెండేండ్ల తర్వాత అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభమైంది.  హిమాలయాల్లో కొలువై ఉన్న పవిత్ర మంచు శివ లింగాన్ని దర్శించుకోవడానికి మొదటి బ్యాచ్‌ జమ్ము బేస్‌ క్యాంప్‌ నుంచి బయలుదేరింది. మూడు వేల మందితో కూడిన మొదటి బ్యాచ్‌ యాత్రను జమ్ము కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా  జెండా ఊపి ప్రారంభించారు. ఈ ఏడాది హిమ లింగాన్ని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తారని జమ్ము కశ్మీర్‌ ప్రభుత్వం భావిస్తున్నది. అయితే కరోనా కారణంగా గత రెండేండ్లు అమర్‌నాథ్‌ యాత్రను ప్రభుత్వం నిర్వహించలేదు.

Social Share Spread Message

Latest News