Skip to main content

Namaste NRI

రెండో ప్రపంచ యుద్ధం తరవాత.. ఎన్నడూ లేనంత

ఉక్రెయిన్‌పై రస్యా కొనసాగిస్తున్న యుద్ధం ఉత్పాతాన్ని సృష్టిస్తోందని, రెండో ప్రపంచ యుద్ధం తరవాత ఎన్నడూ లేనంత ఆహార సంక్షోభాన్ని చూడబోతున్నామని ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ ఆహార కార్యక్రమ సంస్థ కార్యనిర్వాహఖ డైరెక్టర్‌ డేవిడ్‌ బీస్లీ పేర్కొన్నారు. ఫిబ్రవరి 24న రష్యా దండయాత్ర ప్రారంభించక ముందు తమ సంస్థ ప్రపంచమంతటా 12.5 కోట్ల మందికి ఆహారం అందిస్తోందని అన్నారు. దండయాత్ర తరవాత పేదలకు అందించే రోజువారీ రేషన్‌లో కోత పెట్టాల్సి వస్తోందని తెలిపారు. ప్రపంచ గోధమ ఉత్పత్తిలో 30 శాతం ఉక్రెయిన్‌, రష్యా నుంచే వస్తోంది. పేద దేశాల్లో పంచడానికి ప్రపంచ ఆహార కారÊక్రమ సంస్థ 50 శాతం గోధమలను ఉక్రెయిన్‌ నుంచే సేకరిస్తోంది. ఇప్పుడు ఉక్రెయిన్‌లో యుద్ధం మూలంగా గోధమ ఉత్పత్తి పడిపోయి ప్రపంచమంతటా ధరలు పెరిగిపోతున్నాయని తెలిపారు.

Social Share Spread Message

Latest News