Skip to main content

Namaste NRI

లండన్‌లో ప్రధాని మోదీకి.. వ్యతిరేకంగా

లండన్‌ వీధుల్లో ఎన్‌ఆర్‌ఐలు, భారత సంతతికి చెందిన వ్యక్తలు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం హయంలో దేశంలో మైనారిటీలపై దాడులు పెరుగడాన్ని నిరసిస్తూ  బీజేపీకి, మోదీకి వ్యతిరేకంగా ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.  ప్రధాని మోదీ పాస్టిస్‌ విధానాలను తీసుకొస్తున్నారని నిరసనకారులు మండిపడ్డారు. ముస్లింలపై ప్రభుత్వ ప్రేరేపిత హత్యలు, రేప్‌లు పెరిగాయని, లక్షిత వర్గాల ఇండ్లను బుల్డోజర్లతో కూల్చేయడం నిత్యకృత్యంగా మారిందని దుయ్యబట్టారు. లండన్‌లోని ఇండియన్‌ హై కమిషన్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. 15కు పైగా ఇండియన్‌ డయాస్పొరా గ్రూప్‌లు ఈ ఆందోళనల్లో పాల్గొన్నాయి. భారత్‌లోని తమ ఇండ్లను బుల్డోజర్లతో కూల్చేసిన మోదీ సర్కారుకు వ్యతిరేకంగా ఎన్‌ఆర్‌ఐ అఫ్రీనా ఫాతిమా, మరికొందరు ముస్లింలు కూడా ఈ నిరసనల్లో పాల్గొన్నారు. ఆందోళనకారులకు సంఫీుభావం ప్రకటించిన లీసెస్టర్‌ ఈస్ట్‌ ఎంపీ క్లాడియా వెబ్‌ మాట్లాడారు. భారత్‌లో తమ హక్కుల కోసం పోరాడుతున్న మైనారిటీల ప్రజలతో మాట్లాడినట్లు పేర్కొన్నారు. వారి పోరాటాన్ని తమ పోరాటంగా భావిస్తామన్నారు.

Social Share Spread Message

Latest News