ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మస్కట్‌కు ఎయిర్ ఇండియా విమాన సర్వీస్ ప్రారంభమైంది. హైదరాబాద్ నుంచి ఉదయం 11 గంటలకు ఇక్కడికి చేరుకున్న ఎయిర్‌బస్ ఎ`320ఎన్ విమానం 12 గంటలకు మస్కట్‌కు బయలుదేరి వెళ్లింది. ఇక్కడి నుంచి 51 మంది ప్రయాణికులు మస్కట్ వెళ్లినట్లు ఎయిర్‌పోర్ట్ ఇన్‌చార్జి డైరెక్టర్ పి.వి. రామారావు తెలిపారు. ఈ విమానం ప్రతి మంగళవారం విజయవాడ నుంచి మస్కట్ వెళ్లుందని తెలిపారు.