Skip to main content

Namaste NRI

ప్రతి ప్రేమకు ఓ చీకటి కోణం: ఆసక్తికరంగా అగ్లీ స్టోరీ మూవీ ట్రైలర్

నందు, అవికాగోర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్‌ థ్రిల్లర్‌ అగ్లీ స్టోరీ. ప్రణవ్‌ స్వరూప్‌ దర్శకుడు. సుభాషిని, కొండా లక్ష్మణ్‌ నిర్మాతలు. ట్రైలర్‌ను దర్శకుడు సాగర్‌ కె చంద్ర విడుదల చేశారు. ప్రతీ ప్రేమకు ఓ చీకటి కోణం ఉంటుందని, ఆ సత్యాన్ని బలంగా చెప్పడమే ఈ సినిమా లక్ష్యమని దర్శకుడు ప్రణవ్‌ స్వరూప్‌ తెలిపారు. లోతైన భావోద్వేగాలు కలిగిన సినిమా ఇదని హీరో నందు అన్నారు. ప్రేమలోని చేదు నిజాలను చూపించే చిత్రమిదని కథానాయిక అవికా గోర్‌ చెప్పింది. మంచి క్వాలిటీతో విభిన్నమైన కాన్సెప్ట్‌తో సినిమా తీశామని నిర్మాతలు తెలిపారు. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంగీతం: శ్రవణ్‌ భరద్వాజ్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: ప్రణవ్‌ స్వరూప్‌.

Social Share Spread Message

Latest News