ఇరాన్ తమతో శాంతి ఒప్పందం కుదుర్చుకుంటే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ముగిసిపోతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. దాంతో ఇరాన్ సహా అందరికీ హర్మూజ్ జలసంధి తెరుచుకుంటుందని చెప్పారు. లేదంటే మళ్లీ బాంబు దాడులు మొదలవుతాయని హెచ్చరించారు. అవి మునుపటి కంటే భీకర స్థాయిలో, మరింత తీవ్రతతో ఉంటాయని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా-ఇరాన్ యుద్ధం ముగింపు దిశగా ఓ ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్న వేళ ట్రంప్ ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకుంది.

యుద్ధాన్ని ముగించేందుకు మరింత వివరణాత్మక అణు చర్చల కోసం ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేసేందుకు అమెరికా, ఇరాన్ దేశాలు ఓ ఒప్పందానికి చేరువ అవుతున్నాయని తెలిసింది. అణు కార్యక్రమాల తాత్కాలిక నిషేధానికి ఇరాన్ ముందుకు రావడం, హర్మూజ్ జలసంధిలో ఆంక్షలు ఎత్తేయడం, ఇరాన్‌కు చెందిన నిధుల విడుదలకు అమెరికా అంగీకరించడం లాంటివి ఈ ఒప్పందంలో ఉన్నాయని తెలిపింది.





























