ఉగ్రముప్పును నిర్మూలించడం ద్వారా అఫ్గానిస్థాన్‌లో తమ లక్ష్యం నెరవేరిందని అగ్రరాజ్యం అమెరికా ప్రకటించిన్పటికీ ఇది నూరు శాతం నిజం కాదనే వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఆ దేశ నిఘా సంస్థ కూడా ఇదే విషయాన్ని తెలిపింది. అల్‌ఖైదాతో అమెరికాకు ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. తాలిబన్ల సంరక్షణలో అఫ్గాన్ గడ్డపై అల్‌ఖైదా తమను తాము పునర్ నిర్మించుకునే అవకాశం ఉందని, రానున్న ఒకటి రెండేళ్లలో అమెరికా భూభాగంపై దాడులు చేసే ప్రమాదం కూడా ఉందని అమెరికా నిఘా సంస్థ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అఫ్గానిస్థాన్‌లో వనరులను సమకూర్చుకునేందుకు అల్‌ఖైదా అన్ని మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకటి, రెండేళ్లలో ఆ ముఠా మళ్లీ క్రియాశీలకంగా మారి అమెరికాను బెదిరించే స్థాయికి చేరే అవకాశముంది తెలుస్తోంది.