అగ్రరాజ్యం అమెరికా ఎట్టకేలకు తమ తప్పును అంగీకరించింది. అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లో గత నెల 29న జరిపిన డ్రోన్ దాడికి సంబంధించిన అమెరికా ఎట్టకేలకు తప్పు అంగీకరించింది. నాటి దాడిలో కేవలం సాధారణ ప్రజలే మృత్యువాతపడినట్లు తమ అంతర్గత సమీక్షలో తేలిందని తెలిపింది. కాబూల్ విమానాశ్రయం వైపు పేలుడు పదార్థాలతో దూసుకొస్తున్న వాహనంపై తాము డ్రోన్ డాడి చేశామని, అందులో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది హతమయ్యాడని, అమెరికా బలగాలు తొలుత వాదించాయి. ఆ దాడిలో చిన్నారులు సహా సాధారణ పౌరులే ప్రాణాలు కోల్పోయారన్న వార్తలను ఇన్నాళ్లూ ఖండిరచాయి.