Skip to main content

Namaste NRI

అమెరికా గుడ్‌న్యూస్‌.. భారత ప్రయాణికులకు

కరోనా మహమ్మారి రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న విషయం తెలిసిందే.  వైరస్‌ ప్రభావం నుంచి ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ ప్రయాణాలపై ఉన్న ఆంక్షలను తొలగిస్తున్నాయి. ఇందులో భాగంగా భారత్‌తో పాటు మరికొన్ని దేశాల ప్రయాణాలపై ఉన్న ఆంక్షలను సడలిస్తూ అమెరికా నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి అమెరికా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ) భారత్‌కు ఇచ్చిన రేటింగ్స్‌ను సడలించింది. కరోనా వైరస్‌ ఉద్థృతి అధికంగా ఉన్న కారణంగా అమెరికా నుంచి భారత్‌ వెళ్లే ప్రయాణికుల కోసం లెవల్‌ 3 అలెర్ట్‌ కొనసాగిస్తోంది. తాజాగా ఈ స్థాయిని లెవల్‌`1కి మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది భారత ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌ అనే చెప్పాలి.  భారత్‌తో పాటు చాద్‌, గనియా, నమీబియా ప్రయాణ రేటింగ్స్‌ను కూడా లెవల్‌ 1గా మార్చింది.

Social Share Spread Message

Latest News