అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన బ్రిట్టనీ లకాయో 7.90 సెం.మీ(3.11 అంగుళాలు) నాలుకతో ప్రపంచంలోనే అతి వెడల్పైన నాలుక కలిగిన మహిళగా గిన్నిస్ రికార్డ్ సొంతం చేసుకున్నారు. ఆమె నాలుక దాదాపు క్రెడిట్ కార్డ్ అంత వెడల్పు ఉంది. బ్రిట్టనీ అటార్నీగా పని చేస్తున్నారు. తాను చిన్నతనంలో ఏదైనా తినడానికి ఆతృతగా నోరు తెరిచినప్పుడు తన నాలుక పెద్దదిగా ఉందని తన కుటుంబం జోక్ చేసేదని బ్రిట్టనీ చెప్పారు. తన బ్రెస్ట్ ఫ్రెండ్ సూచనతో తన నాలుక వెడల్పు కొలుచుకున్నప్పుడు తనది పెద్ద నాలుక అన్న విషయం తెలిసిందన్నారు. గతంలో అమెరికాకే చెందిన ఎమిలీ షెలెంకర్ పేరిట ఈ రికార్డ్ (7.33 సెం.మీ) ఉండేది.