Namaste NRI

రష్యాపై అమెరికా సంచలన ఆరోపణలు

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. మరోవైపు అంతర్జాతీయ రసాయన ఆయుధాల నిషేధాన్ని రష్యా ఉల్లంఘించి.. కెమికల్‌ వెపన్స్‌ని ఉపయోగిస్తుందని అగ్రరాజ్యం అమెరికా ఆరోపించింది. ఉక్రెయిన్ సైనికులపై ఉక్కిరిబిక్కిరి చేసేలా విషయవాయువు క్లోరోపిక్రిన్‌ను రష్యా ఉపయోగిస్తున్నది అమెరికా పేర్కొంది. విషపూరితమైన రసాయనాల ఉపయోగం మంచిది కాదని.. ఉక్రెనియన్ దళాలను తరిమికొట్టడానికి, యుద్ధం లో వ్యూహాత్మక విజయం సాధించాలనే ఆలోచనతోనే వాటిని ఉపయోగిస్తుండవచ్చని పేర్కొంది. రసాయన ఆయుధాల నిషేధ సంస్థ  ద్వారా క్లోరోపిక్రిన్‌ని నిషేధించింది. రష్యాలో క్లోరోపిక్రిన్‌తో పాటు సీఎస్‌, సీఎన్‌ వాయువులతో నింపిన గ్రెనేడ్‌లను సైతం వినియోగిస్తుందని ఉక్రెయిన్‌ సైన్యం ఆరోపించింది.

విష రసాయనాల కారణంగా దాదాపు 500 మంది ఉక్రేనియన్‌ సైనికులు అస్వస్థతకు గురయ్యారని, ఓ సైనికుడు ఊపిరాడక మరణించాడని ఆరోపించింది. ఈ క్రమంలోనే అగ్రరాజ్యం అమెరికా వస్పందించింది. ఉక్రేనియన్ దళాలకు వ్యతిరేకంగా రష్యా క్లోరోపిక్రిన్ ఉపయోగించడంతో కెమికల్ వెపన్స్ కన్వెన్షన్-1993ని ఉల్లంఘించిందని ఆరోపించింది. క్లోరోపిక్రిన్ అనేది ఓ విషవాయువు. దీన్ని తొలిసారిగా ప్రపంచ యుద్ధంలో జర్మన్ దళాలు వినియోగించాయి. దీన్ని పీలిస్తే తీవ్ర అనారోగ్యానికి గురవుతారు. దీంతో 1993లో హేగ్ ఆధారిత సంస్థ ది ఆర్గనైజేషన్ ఫర్ ద ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్  దీన్ని నిషేధించారు. అనంతరం 193 దేశాలు క్లోరోపిక్రిన్ నిల్వలను ధ్వంసం చేశాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UULmVdT0LRtF67ZbuX2dEeQQ&layout=gallery[/embedyt]