Namaste NRI

ఆనంద్ దేవరకొండ న్యూ ఏజ్ లవ్ స్టోరీ బేబీ ప్రారంభం

ఆనంద్‌ దేవరకొండ, వైష్టవి, చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం బేబీ. సాయి రాజేష్‌ దర్శకుడు. ఎస్‌.కె.ఎన్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేవానికి అల్లు అరవింద్‌ క్లాప్‌నివ్వగా, సుకుమార్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. మారుతి గౌరవ దర్శకత్వం చేశారు. న్యూ ఏజ్‌ ప్రేమ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ఈ నెల 20 నుంచి చిత్రీకరణ ప్రారంభమవుతుంది అని చిత్ర బృందం తెలియజేసింది. విజయ్‌ బుల్గానిన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events