Skip to main content

Namaste NRI

లక్కీ లక్ష్మణ్‌ ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేసిన అనిల్‌ రావిపూడి

సొహైల్‌, మోక్ష జంటగా నటిస్తున్న సినిమా లక్కీ లక్ష్మణ్‌. ఈ చిత్రాన్ని దత్తాత్రేయ మీడియా పతాకంపై హరిత గోగినేని నిర్మిస్తున్నారు. ఏఆర్‌ అభి దర్శకుడు. వినోదాత్మక చిత్రం తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. తాజాగా చిత్ర పస్ట్‌ లుక్‌ను దర్శకుడు అనిల్‌ రావిపూడి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫస్ట్‌ లుక్‌ చాలా బాగుంది. తొలి చిత్రమైనా దర్శక నిర్మాతలు చక్కగా రూపొందించారు. ఈ సినిమా అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా అన్నారు. మంచి కుటుంబ కథా చిత్రమిది. ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది అన్నారు దర్శకుడు. నిర్మాత హరిత మాట్లాడుతూ చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం అన్నారు. కథ పరంగా, సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంటుందన్నారు సోహెల్‌. రాజా రవీంద్ర, సమీర్‌, కాదంబరి కిరణ్‌ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి  ఎడిటర్‌: ప్రవీణ్‌ పూడి, సినిమాటోగ్రఫీ: ఐ ఆండ్రూ, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌.

Social Share Spread Message

Latest News