విదేశీ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్న భారతీయులకు ఓ గుడ్ న్యూస్. త్వరలో భారతీయులకు తైవాన్‌లో భారీ ఎత్తున జాబ్స్ అందుబాటులోకి రావచ్చు. తైవాన్ ప్రభుత్వంతో భారత్ జరుపుతున్న చర్చలు ఫలితాన్నిస్తే ఏకంగా లక్ష జాబ్స్ అందుబాటులోకి వస్తాయి. ఈ దిశగా ఇరు దేశాల మధ్య ఎంప్లాయ్‌మెంట్ మొబిలిటీ అగ్రిమెంట్ కుదిరే అవకాశం ఉన్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అన్నీ అనుకూలిస్తే వచ్చే నెలలోనే ఈ ఒప్పందంపై రెండు దేశాలు సంతకాలు చేయచ్చని సమాచారం.తైవన్‌లోని వివధ రకాల ఫ్యాక్టరీలు, పొలాలు, ఆసుపత్రుల్లో ఈ ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి.
ప్రస్తుతం తైవాన్ జనాభాలో వయసుపైబడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మరోవైపు, యువతకు ఉపాధి కల్పించేస్థాయిలో భారత ఆర్థికరంగం ఊపందుకోవట్లేదు. 2025 కల్లా తైవాన్ సమాజంలో వృద్ధుల సంఖ్య ఏకంగా 20 శాతానికి చేరుకుంటుందని సమాచారం. ఈ నేపథ్యంలో తాజా ఒప్పందం ఇరు దేశాలకు ఉభయతారకమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.














