Namaste NRI

నిజ్జర్ హత్య కేసులో మరో భారతీయుడు అరెస్ట్‌

ఖ‌లిస్తానీ ఉగ్రవాది హ‌ర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో మరో భారతీయుడిని కెనడా పోలీసులు అరెస్టు చేశారు. హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ గతేడాది కెనడాలో  హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసుతో సంబంధ మున్న ముగ్గురు భార‌తీయులను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా అమన్‌దీప్‌ సింగ్‌ అనే 22 ఏండ్ల యువకుడిని అరెస్టు చేసిన‌ట్లు అధికారులు వెల్లడించారు.

బ్రాంప్టన్‌లో నివసిస్తున్న అమన్‌దీప్‌, ఆయుధాలకు సంబంధించిన కేసులో అంటారియో పోలీసుల కస్టడీలో ఉన్నాడని, అతడిని తమ అదుపులోకి తీసుకున్నామని ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ ఇన్‌చార్జి మన్‌దీప్‌ మూకర్‌ వెల్లడించారు. ఇండియాలో వాంటెడ్ లిస్టులో ఉన్న ఉగ్రవాది నిజ్జార్‌ను 2023, జూన్ 18వ తేదీన కెన‌డాలోని స‌ర్రేలో ఉన్న ఓ గురుద్వారా వ‌ద్ద హ‌త్య చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UULmVdT0LRtF67ZbuX2dEeQQ&layout=gallery[/embedyt]