Skip to main content

Namaste NRI

డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం… తక్షణం అమల్లోకి

అమెరికాలో డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థుల వీసా ఇంటర్వ్యూల ను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మేరకు వివిధ దేశాల్లోని యూఎస్‌ ఎంబసీలకు ట్రంప్‌ సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది.

తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు దౌత్య విభాగాలు అదనంగా ఎటువంటి వీసా అపాయింట్ మెంట్లను అనుమతించొద్దని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలను ఆదేశించారు. ఇప్పటికే బుక్ చేసుకున్న ఇంటర్వ్యూలు ప్రణాళిక ప్రకారం కొనసాగుతాయని వెల్లడించారు. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని తెలిపారు. అభ్యర్థుల సోషల్ మీడియా ఖాతాల పరిశీలనకు  సన్నాహాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News