Skip to main content

Namaste NRI

పెంటగాన్‌ మరో కీలక నిర్ణయం .. సైనికుల‌కు త‌ప్ప‌నిస‌రి!

అమెరికా సైన్యాన్ని మరింత సమర్థంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పెంటగాన్‌ మరో కీలక నిర్ణయం తీసుకుందని ఆ దేశ ర‌క్ష‌ణ మంత్రి పీట్ హెగ్సేత్ ప్ర‌క‌టించారు. యుద్ధ సామర్థ్యాన్ని పెంచే చర్యల్లో భాగంగా సైనికుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించిన‌ట్లు తెలిపారు. ఇందులో భాగంగా 30 ఏళ్లు దాటిన సైనికులకు హార్మోన్‌ పరీక్షల ను తప్పనిసరి చేస్తూ కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చిన‌ట్లు వెల్ల‌డించారు.

పెంటగాన్‌ ప్రకటించిన కొత్త నిబంధనల ప్రకారం.. యాక్టివ్‌ డ్యూటీ, రిజర్వ్‌ విభాగాల్లో పనిచేస్తున్న 30 ఏళ్లు పైబడిన సైనికులందరికీ టెస్టోస్టెరాన్‌ లోపం ఉందా? లేదా? అనే పరీక్ష తప్పనిసరిగా నిర్వహించనున్నారు. ప్రతి ఏడాది జరిగే పీరియాడిక్‌ హెల్త్‌ అసెస్‌మెంట్‌లో ఈ పరీక్షను భాగంగా చేర్చారు. 30 ఏళ్లలోపు ఉన్న సైనికులు కోరితే స్వచ్ఛందంగా ఈ పరీక్ష చేయించుకునే అవకాశం కల్పించారు. రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సేత్‌ ఆదేశాల మేరకే ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు పెంటగాన్‌ ప్రధాన ప్రతినిధి షాన్‌ పార్నెల్‌ తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events