అగ్ర హీరో వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ క్రైమ్ ఎంటర్‌టైనర్ రాబోతున్న ది. ఉగాది సందర్భంగా సినిమా ప్రకటన వెలువడింది. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అగ్ర నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించనున్నారు.ట్రయాంగ్యులర్ క్రైమ్ ఎంటర్‌టైనర్ ఇది. హీరో, అతని భార్య, మాజీ ప్రేయసి మధ్య నడిచే కథ ఇది. కాన్సెప్ట్ వైవిధ్యంగా ఉంటుంది. క్రైమ్ ఎలిమెంట్‌తో పాటు కామెడీతో మెప్పిస్తుంది. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాం. 2025 సంక్రాంతికి విడుదల చేసేందకు సన్నాహాలు చేస్తున్నాం అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, రచన-దర్శకత్వం: అనిల్ రావిపూడి.