Skip to main content

Namaste NRI

కాంతార చిత్రానికి మరో అరుదైన గౌరవం

కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో తెలియంది కాదు. రిషభ్ షెట్టి, కిషోర్‌కుమార్‌, అచ్యుత్‌ కుమార్‌, సప్తమిగౌడ, ప్రమోద్‌ షెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు. హోంబలే ఫిలింస్‌ బ్యానర్ కింద విజయ్‌ కిరగందూర్‌ సినిమాను నిర్మించారు.   తాజాగా ఇక ఇప్పుడు కాంతార చిత్రం  అరుదైన గౌరవం దక్కించుకుంది.

జెనీవాలోని ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో నేడు ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. ఈ నేపథ్యంలో నటుడు, దర్శకుడు రిషభ్‌ శెట్టి ఇప్పటికే స్విట్జర్లాండ్ చేరుకున్నారు. సినిమా స్క్రీనింగ్ ముగిసిన అనంతరం పర్యావరణ పరిరక్షణలో భారతీయ సినిమాల పాత్రపై ఆయన ప్రసంగిస్తారు. కాగా, ఐక్యరాజ్య సమితిలో ప్రదర్శితమయ్యే తొలి చిత్రంగా కాంతార రికార్డ్స్ లో నిలవబోతుంది. ఈ  చిత్రం  కేవలం రూ.16 కోట్ల తో తెరకెక్కిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.400 కోట్లు సాధించింది. విడుదలైన అన్ని భాషల్లో అఖండ విజయం సాధించి ఎన్నో అవార్డ్స్ దక్కించుకుంది.

Social Share Spread Message

Latest News