నటి ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో సత్తా చాటుతుంది. ఆమె ఇప్పటికే అంతర్జాతీయంగా పలు గౌరవాలు దక్కించుకుంది. తాజాగా ఆమెకు మరో గౌరవం దక్కింది. ప్రొడ్యూసర్ గిల్డ్ ఆఫ్ అమెరికా (పీజీఏ)లో ఆమె సభ్యురాలైంది. ఈ విషయాన్ని పీజీఏ ట్విటర్ ద్వారా ప్రకటించింది. నటి, గాయని, నిర్మాత ప్రియాంక చోప్రాకు ఏజీఏలోకి స్వాగతం అని ట్వీట్ చేసింది. నన్ను పీజీఏలో చేర్చినందుకు గొప్పగా ఉంది. ధన్యవాదాలు అని ప్రియాంక చోప్రా తెలిపింది. పర్పుల్ పెబెల్స్ పేరుతో నిర్మాత సంస్థను ఏర్పాటు చేసి వెంటిలేటర్, పానీ లాంటి చిత్రాలను నిర్మించింది ప్రియాంక. ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్న ది వైట్ టైగర్ చిత్రంలో నటించడంతో పాటు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగానూ వ్యహరించింది ప్రియాంక. ఆమె ప్రస్తుతం ది మాట్రిక్స్, టెక్ట్స్ ఫర్ యు, జీలేజరా చిత్రాలతో పాటు సిటాడెల్ వెబ్ సిరీస్‌లోనూ నటిస్తోంది.