అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. వాషింగ్టన్ శనివారం రాత్రి కారులో వచ్చిన ఓ అగంతకుడు పెట్రేగిపోయాడు, జన సమూహంపై విచక్షణా రహితంగా కాల్పలు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరో ముగ్గరు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మరణించిన వారంతా యువకులే అని మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ చీఫ్ రాబర్ట్ కాంటీ వెల్లడిరచారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందన్నారు. ఈ దాడిలో నిందితుడు ఉపయోగించిన వాహనం తాలుకు ఫొటోలను దగ్గరలోని సీసీ కెమెరా నుంచి సెకరించినట్టు కాంటీ వివరించారు.
ఆ వాహనంలో ఎంత మంది అనుమానితులు ఉన్నారు అన్నది తెలియాల్సి ఉందన్నారు. ఒక్కరు కాకుండా ఇద్దరు ముగ్గురు కలిసి కాల్పలు జరిపినట్లు అనుమానిస్తున్నట్టు తెలిపారు. వాహనంలో ఉన్నవారికి బాధితులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయా, అన్న కోణంలోనూ విచారిస్తున్నట్టు వివరించారు. ఘటనా స్థలం నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ఘటన గురించి తెలిసినవారు వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా కాంటి వివరించారు.