Namaste NRI

గుంటూరు కారం నుంచి మ‌రో అప్‌డేట్

సూపర్ స్టార్ మహేష్ బాబు,  డైరెక్ట‌ర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. శ్రీలీల కథానాయిక. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌ సింగిల్‌కు సంబంధించిన ఓ అప్‌డేట్‌ సోషల్ మీడియాను ఊపేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సాంగ్ సోష‌ల్ మీడియాలో లీక్ అవ్వ‌డంతో మేక‌ర్స్ వేగం పెంచారు. తాజాగా ఈ సినిమా నుంచి మేక‌ర్స్ ఫస్ట్‌ సింగిల్ అనౌన్స్‌మెంట్ చేశారు. ఎప్పుడెప్పుడా అంటూ మహేష్ ఫ్యాన్స్ క‌ళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న గుంటూరు కారం ఫస్ట్‌ సింగిల్‌ను  మంగ‌ళవారం (న‌వంబ‌ర్ 07) రిలీజ్ చేయ‌బోతున్నారు మేక‌ర్స్. అయితే అంత‌కంటే ముందే ఫ్యాన్స్‌ను ఖుషి చేయ‌డం కోసం మ‌రో అప్‌డేట్ ఇచ్చారు. తాజాగా ఈ ఫ‌స్ట్ సింగిల్ ధ‌మ్ మసాలా కు సంబంధించి ప్రోమో విడుద‌ల చేశారు. ఎదురొచ్చే గాలి.. ఎగరేస్తున్నా చొక్కా పై గుండీ.. ఎగబడి ముందరకే వెళ్ళిపోతాది నేనెక్కిన బండి. ధమ్ మసాలా బిర్యానీ.. ఎర్ర కారం.. అర కోడి, నీంబు సోడా.. ఫుల్ బీడీ, గుద్ది పారేయి గుంటూరునే అంటూ సాగిన లిరిక్స్ రిపీట్ మోడ్ లో వినేలా చేస్తున్నాయి. మరి ఈ సాంగ్ ఫుల్ వెర్షన్ వ‌చ్చాక ఎన్ని రికార్డులు కొడుతుందో చూడాలి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events