Namaste NRI

ప్రధాని మోదీతో సమావేశమైన ఆంటోని బ్లింకెన్

భిన్నత్వమే భారత్‌, అమెరికా సమాజాల బలమని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ అన్నారు. ప్రధాని మోదీతో బ్లింకెన్‌ భేటీ అయ్యారు. భారత్‌`అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే విషయంలో అమెరికా అధ్యక్షుడు ప్రదర్శిస్తున్న అంకితభావం, పట్టుదల అభినందనీయమని మోదీ పేర్కొన్నారు. భారత్‌, అమెరికా సంబంధ బాంధవ్యాలను, వ్యూహాత్మక భాగస్వామాన్ని బలోపేతం చేసే దిశగా బైడెన్‌ చూపుతున్న అంకితభావాన్ని స్వాగతిస్తున్నాం. ఇరు దేశాల  నడుమ ప్రజాస్వామ్య విలువలను పంచుకోవడానికే కాదు అంతర్జాతీయంగానూ మన వ్యూహాత్మక భాగస్వ్యామం కీలకం అని మోదీ ట్వీట్‌ చేశారు. అమెరికాలో ఉంటున్న భారతీయుల ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే విషయంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు.

Social Share Spread Message

Latest News