Skip to main content

Namaste NRI

అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్‌ తీపి కబురు : మహేష్‌ బిగాల

అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిరుద్యోగులకు తీపి కబురు చెప్పారని టీఆర్‌ఎస్‌ ఎన్నారై కోఆర్డినేటర్‌ మహేష్‌ బిగాల అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పోరాడి తెచ్చుకున్న తెలంగాణ కల నేటితో సాకారం అయిందని అన్నారు. రాష్ట్రంలో ఒకేసారి భారీ ఎత్తున 91,142 ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేయడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలతో సంపూర్ణ తెలంగాణ కల సాకారం అయిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు అంతా రుణపడి వుంటారని అన్నారు.  ఎన్నారైల అందరి తరపున సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Social Share Spread Message

Latest News