Skip to main content

Namaste NRI

ఆస్ట్రేలియా ప్రధాని కీలక ప్రకటన

ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌ కీలక ప్రకటన చేశారు. దేశంలో 16 ఏండ్ల లోపు పిల్లలు సామాజిక మాధ్యమాల వాడకాన్ని నిషేధిస్తున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్‌ సేఫ్టీ ఎమెడ్మెంట్‌ బిల్‌-2024 ఈ ఏడాది డిసెంబర్‌ 10 నుంచి అమల్లోకి రానుంది. ఫేస్‌బుక్‌, ఎక్స్ (ట్విట్టర్‌)‌, ఇన్‌స్టాగ్రామ్‌, టిక్‌టాక్‌, స్నాప్‌చాట్‌, రెడిట్‌, యూట్యూబ్‌ తదితర మాధ్యమాలకు ఈ చట్టం వర్తించనుంది.సామాజిక మాధ్యమాలు వినియోగించకుండా నిషేధాన్ని విధిస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం గతేడాది కొత్త చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆ బిల్లుకు ఆస్ట్రేలియా ప్రతినిధుల సభ ఆమోద ముద్ర వేసింది. ప్రతినిధుల సభలో 102 ఓట్ల బలంతో బిల్లుకు ఆమోదం లభించింది. సెనెట్‌లో ఈ బిల్లుకు అనుకూలంగా 34, వ్యతిరేకంగా 19 ఓట్లు వచ్చాయి.

ఈ బిల్లు ప్రకారం 16 ఏండ్ల లోపు పిల్లల సామాజిక మాధ్యమ ఖాతాలను నిరోధించడంలో వ్యవస్థాగతంగా విఫలమైతే సామాజిక మాధ్యమాలకు 50 మిలియన్‌ ఆస్ట్రేలియన్‌ డాలర్ల వరకు జరిమానా విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. అంటే మన భారత కరెన్సీ ప్రకారం రూ.273 కోట్లకు పైమాటే. బిల్లు చట్ట రూపం దాల్చితే సోషల్ మీడియాపై నిషేధం విధించిన తొలి దేశంగా ఆస్ట్రేలియా రికార్డుకెక్కనుంది.

Social Share Spread Message

Latest News