Skip to main content

Namaste NRI

క్రిస్మస్‌కు ముందు.. అమెరికాలో మరోసారి

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. క్రిస్మస్‌కు ముందు ఫ్లోరిడాలోని ఓ మాల్‌లో కాల్పులు చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఓ మహిళ గాయాలకు గురైంది. ఫ్లోరిడాలోని ఓకాలా మాల్‌లో కాల్పుల ఘటన జరిందని ఓకాలా పోలీస్‌ చీఫ్‌ మైక్‌ బాల్కెన్‌ తెలిపారు. ప్యాడాక్‌ మాల్‌లో పలు రౌండ్ల కాల్పులు జరిగాయని, ఆ తర్వాత పోలీసులకు సమాచారం వచ్చిందని తెలిపారు. తుపాకీ కాల్పుల్లో ఒక వ్యక్తి చనిపోయినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. మరో మహిళ కాలికి తూట గాయమైందని పేర్కొన్నారు. ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. దాడి ఘటన తర్వాత సంఘటనా స్థలం నుంచి నిందితుడు పారిపోయాడని,  అతని కోసం గాలిస్తున్నట్లు బాల్కెన్‌ పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News