Skip to main content

Namaste NRI

మంగళూరులో భీమా యాక్షన్‌ షెడ్యూల్‌ ప్రారంభం

గోపీచంద్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం భీమా. ఏ.హర్ష దర్శకత్వం.  శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకం పై కేకే రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్‌ మంగళూరు లో మొదలైంది. హీరో గోపీచంద్‌ తో పాటు ఇతర ముఖ్య తారాగణం పాల్గొంటున్నారు. మంగళూరులోని దట్టమైన అడవిలో ఓ పాటతో పాటు యాక్షన్‌ ఘట్టాలను తెరకెక్కించబోతున్నారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ ఇది. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించే అన్ని అంశాలుంటాయి. అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిస్తున్నాం. గోపీచంద్‌ పాత్ర గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: స్వామి జె గౌడ, సంగీతం: రవి బస్రూర్‌, సంభాషణలు: అజ్జు మహంకాళి, దర్శకత్వం: ఏ. హర్ష.

Social Share Spread Message

Latest News