Skip to main content

Namaste NRI

నేడే బైడెన్- జిన్ పింగ్ వర్చువల్ సమావేశం

ఆర్థిక, సైనిక, రాజకీయ బలాల పరంగా ప్రపంచంలోనే టాప్‌`2 అగ్రదేశాలైన అమెరికా, చైనాల మధ్య స్నేహం మళ్లీ చిగురించింది. ట్రంప్‌ ఏలుబడిలో దారుణంగా దెబ్బ తిన్న సంబంధాలను మళ్లీ పునరుద్ధరించుకుంటున్నారు దేశాధినేతలు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ నేడు వర్చువల్‌ సమావేశం జరుగనుంది. రెండు అగ్రరాజ్యాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఈ భేటీ జరుగుతోంది. డొనాల్డ్‌ ట్రంప్‌ హయాం నుంచి అమెరికాతో దెబ్బతిన్న వాణిజ్య సంబంధాలు, తైవాన్‌ అంశం, హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య హక్కులు, ఉయ్‌గుర్‌లపై అణచివేత తదితర అంశాలు వీరిద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత అగ్రదేశాల అధినేతలు సుహృద్భావ వాతావరణంలో మాట్లాడుకున్న ఈ భేటీని రెండు దేశాలూ చారిత్రక ఘట్టంగా అభివర్ణిస్తున్నాయి.

Social Share Spread Message

Latest News