Skip to main content

Namaste NRI

ప్రపంచకప్ ముగింపు వేడుకలకు…భారీగా  ఏర్పాట్లు

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో  ప్రపంచకప్ ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బిసిసిఐ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఆదివారం ఇక్కడి నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య తుది పోరు జరుగనున్న విషయం తెలిసిందే. నెల రోజులకు పైగా క్రికెట్ అభిమానులను కనువిందు చేసి మెగా టోర్నమెంట్‌కు ఆదివారంతో తెరపడనుంది. ఈ నేపథ్యంలో ముగింపోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని బిసిసిఐ పెద్దలు నిర్ణయించారు. ఆదివారం ఫైనల్ మ్యాచ్ ఆరంభానికి ముందు నిర్వహించనున్న వాయు సేన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా మారనున్నాయి.

వాయుసేనకు చెందిన సూర్య కిరణ్ ఏరోబాటిక్ బృందం ఈ విన్యాసాలు నిర్వహించనుంది. ఫైనల్ మ్యాచ్ ఆరంభానికి పది నిమిషాల ముందు ఈ వేడుక జరుగనుంది. అంతేగా పాప్ సింగ్ దువా లిపా కూడా ముగింపు వేడుకల్లో ఉర్రుతాలుగించనున్నారు. దువా లిపతో ప్రత్యేక ఈవెంట్‌ను నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. హాలీవుడ్, అల్బేనియన్ పాప్ సింగర్ అయిన లిపాతో ఇటీవల నిర్వహించిన ఆస్క్ దువా వర్చువల్ సెషన్‌లో భారత క్రికెటర్లు శుభ్‌మన్ గిల్, రాహుల్, కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌లు పాల్గొన్నారు. అయితే లిపాతో నిర్వహించే కార్యక్రమంపై బిసిసిఐ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events