Namaste NRI

లైగ‌ర్ నుంచి బిగ్ అప్‌డేట్‌.. ఫ‌స్ట్ సింగిల్ వ‌చ్చేది అప్పుడే

విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమా లైగర్‌. అనన్య పాండే నాయికగా నటిస్తున్నది. దర్శకుడు పూరి జగన్నాథ్‌ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఫస్ట్‌ సింగిల్‌ అక్టీ పక్డీ ని ఈ నెల 11న విడుదల చేయబోతున్నారు. ఈ పాట పోస్టర్‌ను రిలీవ్‌ చేశారు. అందులో విజయ్‌.. అనన్యతో విజిల్‌ కొట్టిస్తూ కనిపించారు. పబ్‌లో సాగే పార్టీ సాంగ్‌గా ఈ పాట ఉండనుంది. ఈ పాటకు భాస్కరభట్ల రవికుమార్‌ సాహిత్యాన్ని అందించగా, అనురాగ్‌ కులకర్ణి, రమ్య బెహరా పాడారు.  రమ్యకృష్ణ, మైక్‌ టైసన్‌, రోనీ రాయ్‌ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పూరి కనెక్ట్స్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ పతాకాలపై పూరి జగన్నాథ్‌, చార్మీ కౌర్‌, కరణ్‌ జోహార్‌, అపూర్వ మెహతా నిర్మిస్తున్నారు.  షూటింగ్‌ చివరి దశలో ఉన్న ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events