Skip to main content

Namaste NRI

బైకర్‌ ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

శర్వానంద్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం బైకర్‌. ఇండియాలో ఫస్ట్‌ మోటోక్రాస్‌ రేసింగ్‌ సినిమా ఇది. అభిలాష్‌ రెడ్డి కంకర దర్శకుడు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్నది. సీనియర్‌ నటుడు రాజశేఖర్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్ని వేగవంతం చేశారు. ప్రెట్టీ బేబీ అనే వీడియోసాంగ్‌ను విడుదల చేశారు. అదిరిపోయే బీట్‌తో డ్యాన్స్‌ నెంబర్‌గా జిబ్రాన్‌ ఈ పాటను కంపోజ్‌ చేశారు. కృష్ణకాంత్‌ లిరిక్స్‌ క్యాచీగా ఉన్నాయి. ఈ పాటలో శర్వానంద్‌-మాళవిక నాయర్‌ మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది.1990-2000 బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఈ కథలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా తన లక్ష్యాన్ని నెరవేర్చుకునే బైకర్‌గా శర్వానంద్‌ కనిపిస్తారని, మూడుతరాల రేసింగ్‌ కలకు అద్దంపట్టే చిత్రమిదని, గెలవడం కాదు, చివరిదాక పోరాడటమే గొప్ప అనే సందేశంతో ఈ సినిమా మెప్పిస్తుందని మేకర్స్‌ తెలిపారు. డిసెంబర్‌ 6న విడుదలకానుంది.

Social Share Spread Message

Latest News