హీరో నాగ చైతన్య ఓ ద్విభాషా చిత్రంలో నటించబోతున్నారు. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు రూపొందించనున్నారు. నాగా చైతన్య హీరోగా నటిస్తున్న ఈ 22వ చిత్రాన్ని తాజాగా ప్రకటించారు. భారీ బడ్జెట్తో కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉంటుందని, త్వరలో నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడిస్తామని చిత్ర నిర్మాత తెలిపారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా చిత్రీకరణ జరపనున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నాగ చైతన్య నటించిన థాంక్యూ సినిమా విడులకు సిద్ధమవుతున్నది. దీంతో పాటు దూత అనే వెబ్ సిరీస్లో ఆయన నటిస్తున్నారు.














