Namaste NRI

ఆపరేషన్ సమయంలో ఏడ్చినందుకు బిల్లేసిన డాక్టర్లు

అగ్రరాజ్యం అమెరికాలో షాకింగ్‌ విషయం వెలుగులోకి వచ్చింది.  ఓ మహిళపట్ల ఆసుపత్రి దారుణంగా ప్రవర్తించింది. ఒక మహిళ సర్జరీ సమయంలో ఏడ్చినందుకు ఆసుపత్రి బిల్లులో భావోద్వేగం పేరుతో స్వల్పంగా ఛార్జ్‌ చేశారు. సాధారణంగా ఆసుపత్రి అన్నా, అందులోనూ శస్త్రచికిత్స అన్నా రోగులు భయాందోళన చెందుతారు. అమెరికాకు చెందిన మిడ్జ్‌ అనే ట్విట్టర్‌ యూజర్‌ ఇటీవల తన శరీరంపై ఉన్న మచ్చను తొలగించుకునేందుకు సర్జరీ చేయించుకున్నారు. కాగా శస్త్రచికిత్స సమయంలో ఆమె కొంచెం ఏడ్చారు. అయితే ఆసుపత్రి బిల్లులో దీనికి కూడా చార్జ్‌ చేయడం చూసి ఆమె ఆశ్చర్యపోయారు. సర్జరీ సమయంలో స్వల్ప భావోద్వేగం పేరుతో 11 డాలర్లు ( సుమారు రూ.817) బిల్లులో వేశారు. దీంతో మోల్‌ తొలగించనందుకు 223 డాలర్లు, ఏడ్చినందుకు అదనపు చార్జీ అంటూ సంబంధిత సర్జరీ బిల్లును తన ట్విట్టర్‌లో ఖాతాలో ఆమె పోస్ట్‌ చేశారు. ఆ మహిళ ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా వైరల్‌ అయ్యింది.

Social Share Spread Message

Latest News