Skip to main content

Namaste NRI

భారతీయులకు బ్రిట‌న్ ప్ర‌ధాని రిషి సునాక్ తీపిక‌బురు

ఇండియా సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని అయిన సంగతి తెలిసిందే. కాగా ఆయన ప్రధాని కాగానే ఇండియాకి శుభవార్త చెప్పారు. భారత్ లోని యువ నిపుణులకు ప్రతి ఏడాది 3,000 వీసాలు ఇచ్చేందుకు బ్రిటన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గతేడాది అంగీకరించిన యూకే-ఇండియా మైగ్రేషన్ అండ్ మొబిలిటీ భాగస్వామ్యంలో భాగంగా, ఈ పథకం నుంచి ఇలాంటి లబ్ధి పొందిన మొదటి దేశం భారతేనని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. డిగ్రీ పూర్తి చేసిన భారతీయులు యూకే వచ్చి రెండేళ్లు ఉండేందుకు ఈ వీసా ద్వారా అనుమతిస్తారు.

Social Share Spread Message

Latest News