Namaste NRI

సీఎం కేసీఆర్ స‌భ‌లో బుల్లెట్ల క‌ల‌క‌లం

న‌ర్సాపూర్‌లో నిర్వ‌హించిన‌ సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో బుల్లెట్లు కలకలం సృష్టించాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ నర్సాపూర్‌ సభలో పాల్గొన్నారు. ఈ సభలో ఒక్కసారిగా బుల్లెట్లు బయటపడ్డాయి. కేసీఆర్ సభలో ప్రసంగిస్తుండగా అస్లాం అనే యువకుడు అనుమానాస్పందంగా తిరుగుతుండడంతో పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అస్లాం నుంచి రెండు బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అస్లాం సంగారెడ్డి జిల్లా రాయికోడ్‌కి చెందిన వ్య‌క్తిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు అస్లాంను విచారిస్తున్నారు. కాగా ఈ ఘటనపై బీఆర్ఎస్ నేతలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events