Namaste NRI

దీపావళి వేడుకల్లో కెనడా ప్రధాని ట్రుడో

భారత్‌-కెనడా మధ్య తీవ్ర  ఉద్రిక్తతల వేళ కెనడాలో భారతీయులు నిర్వహించిన దీపావళి వేడుకల్లో  ప్రధాని జస్టిన్‌  ట్రుడో పాల్గొన్నారు. పార్లమెంట్‌ హిల్‌లో జరిగిన ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలను ప్రధాని సోషల్‌ మీడియాలో పోస్టు చేసి అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.  మరికొద్ది రోజుల్లో ప్రజలు దీపావళి, బండి చోర్‌ దివస్‌ జరుపుకుంటారు. ఈ రెండు వేడుకలు చెడుపై మంచికి చిహ్నాలు. ఈ వేడుకలు మనలో ఆశావాహ దృక్పథాన్ని నింపుతాయి. మన జీవితాల్లో వెలుగులు ప్రసాదిస్తాయి. ఈ వేడుకలు రాబోయే రోజుల్లో ఆశాజనకంగా ఉంటాయని ఆశిస్తున్నా. అందరికీ దీపావళి, బండి చోర్‌ దివస్‌ శుభాకాంక్షలు అని రాసుకొచ్చారు.  ఈ దీపావళి వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events