Skip to main content

Namaste NRI

లండన్‌లో ఎన్నారైల సంబరాలు

తెలంగాణ రాష్ట్ర టీవీ, చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా టీఆర్‌ఎస్‌ ఎన్నారై సంస్థ వ్యవస్థాపకుడు అనిల్‌ కూర్మాచలం నియామకంపై లండన్‌లో ఎన్నారైలు సంబరాలు జరుపుకున్నారు. కేక్‌ కట్‌ చేసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ ఎన్నారై యూకే అధ్యక్షుడు అశోక్‌ దూసరి మాట్లాడుతూ అనిల్‌ కూర్మాచలం నియామకం ప్రతి ప్రవాస తెలంగాణ బిడ్డకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్‌ వెంట నడిచి, బంగారు తెలంగాణ ఏర్పాటుకు అదే స్ఫూర్తితో పని చేస్తున్న క్రమశిక్షణ గల ఉద్యమకారుడికి దక్కిన గౌరవమని  అన్నారు.

                ఈ కార్యక్రమంలో టాక్‌ అధ్యక్షులు రత్నాకర్‌ కడుడుల, అనిల్‌ కూర్మాచలం కుటుంబం సభ్యులు ప్రభలత కూర్మాచలం, నిత్య శ్రీ, టాక్‌, ఎన్నారై టీఆర్‌ఎస్‌ నాయకులు వెంకట్‌ రెడ్డి దొంతుల, స్వాతి బుడగం, శుష్మున రెడ్డి, సత్య చిలుముల, సురేష్‌ బుడగం, జాహ్నవి, నవీన్‌ రెడ్డి, రవి రెటినేని, సుప్రజ పులుసు, మల్లారెడ్డి, హరిబాబు గౌడ్‌ నవాపేట, శ్రీ శ్రావ్య వందనపు, సత్యపాల్‌ రెడ్డి పింగిలి, రవి ప్రదీప్‌ పులుసు, పృథ్వీ రావుల, అపర్ణ, రవికిరణ్‌, మణి తేజ్‌, జస్వంత్‌, నిఖిల్‌ తదితరులు  పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News