కార్తీక్ ఆర్యన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం చందూ ఛాంపియన్. కబీర్‌ఖాన్ ఈ సినిమాకు దర్శకత్వం. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా, ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకోగా, విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో పోస్ట్ ప్రోడక్షన్స్ పనులు శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే మూవీలో తన పాత్రకు డబ్బింగ్ కంప్లీట్ చేశాడు కార్తీక్ ఆర్యన్. త్వరలోనే ఈ మూవీ ట్రైలర్‌ను కూడా విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతు న్న ఈ సినిమాను నదియావాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సాజిద్ నదియావాలా నిర్మిస్తున్నా రు.
భారతదేశం నుండి మొదటి పారాలింపిక్ బంగారు పతక విజేతగా నిలిచిన ఫ్రీస్టైల్ స్విమ్మర్ మురళీకాంత్ పేట్కర్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతుంది. 1965 ఇండో-పాక్ యుద్ధంలో తీవ్రంగా గాయపడిన మురళీకాంత్ అంగ వైకల్యానికి గురయ్యారు. అయినా మొక్కవోని ధైర్యంతో 1972లో జరిగిన ప్రపంచ పారాలింపిక్స్‌లో పాల్గొని ఈత విభాగంలో గోల్డ్ మెడల్‌ను సాధించారు. ఆయన స్ఫూర్తివంతమైన ప్రయాణాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించబోతున్నారని సమాచారం. ఈ సినిమాను జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.