భారతీయులకు చైనా షాక్ ఇచ్చింది. తమ దేశంలో చదువుతున్న విద్యార్థులు, పనిచేస్తున్న ఉద్యోగులను తిరిగి చైనాలోకి అనుమతించడంపై ఆంక్షలను కొనసాగిస్తోంది. అయితే భారత్ నుంచి 23 వేల మందికి పైగా విద్యార్థులు, వందల సంఖ్యలో ఉద్యోగులు వారి కుటుంబాలు చైనా వెళ్లడం కోసం వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ ప్రతినిధి రaావో లిజియాన్ మాట్లాడుతూ చైనా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ను పరిశీలిస్తూ, పరిస్థితులు అనుకూలంగా ఉన్న దేశాల నుంచి ఉద్యోగులను రప్పించుకుంటుందని తెలిపారు. జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ దేశాలకు చెందిన ఉద్యోగులను తిరిగి చైనాలోకి తీసుకొచ్చేందుకు ఆ దేశం తాజాగా చార్టర్డ్ విమానాలకు అనుతులు జారీ చేసింది.