అమెరికాపై సెప్టెంబర్ 11 నాటి దాడులు మళ్లీ జరిగే అవకాశాలు ఉన్నాయని చైనా అమెరికాను హెచ్చరిస్తున్నది. అమెరికాపై దాడులు జరిగిన 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గ్లోబల్ టైమ్స్ ఎడిటర్ హు షిజిన్ ఈ విషయాలను ఊహిస్తున్నట్లు వెల్లడిరచారు. సెప్టెంబర్ 11 నాటి దాడి 19 మంది ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి అని, అయితే ఇది ఉగ్రవాద ఆత్మాహుతి దాడి మాత్రం కాదని హు షిజన్ అన్నారు. మరో ఘోరమైన దాడికి ఉగ్రవాదం బలం చేకూరుస్తుందని తెలిపారు. చైనాను తమ అతిపెద్ద శత్రువుగా భావించడం అమెరికా తప్పేనా అనేది కాలమే నిర్ణయిస్తుందన్నారు. చైనా, అమెరికా మధ్య సంబంధాలు చాలా క్షీణించాయని తెలిపారు. చైనాలోని ఉయ్ఘార్ ముస్లింలపై జరిగిన దారుణాలపై అమెరికా మిత్రదేశాలు కూడా చైనాపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.