Skip to main content

Namaste NRI

భారత రాయబారిపై చైనా ప్రభుత్వం  ప్రశంసలు

చైనాలో భారత రాయబారిగా నియమితులైన ప్రదీప్‌ కుమార్‌ రావత్‌పై చైనా ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. రావత్‌ చైనా భాషలో అద్భుతంగా మాట్లాడగలరు. ప్రదీప్‌ రావత్‌ను రాయబారిగా నియమించడం వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగవుతాయని చైనా ప్రభుత్వం పేర్కొంది. ఈ నియామకం వల్ల ఇరు దేశాల మధ్య వున్న పొరపొచ్చాలు, విభేదాలు కనుమరుగవడం ఖాయమని చైనా అభిప్రాయపడిరది. మార్చి 14న చైనా రాయబారిగా ప్రదీవ్‌ కుమార్‌ రావత్‌ను భారత ప్రభుత్వం నియమించింది. ఈయనకు ఘన స్వాగతమే పలికింది. ఆయన్ను ఆకాశానికి ఎత్తేస్తూ చైనా ప్రభుత్వం వ్యాఖ్యలు కూడా చేసింది.

Social Share Spread Message

Latest News