Namaste NRI

మంచి కంటెంట్ తో చిరంజీవి .. ఫస్ట్‌గ్లింప్స్‌ విడుదల

కికు యనమల, కశిష్‌ ఖాన్‌ జంటగా నటిస్తున్న చిత్రం చిరంజీవి. శుభసాయి వెంకట్‌ దర్శకుడు. ఫస్ట్‌గ్లింప్స్‌ను విడుదల చేశారు. డెక్ట్సోకార్డియా (కుడివైపు గుండె ఉండే అరుదైన పరిస్థితి) అనే పాయింట్‌ చుట్టూ అల్లుకున్న భావోద్వేగభరిత కథాంశమిదని, నాయకానాయికలు కొత్తవాైళ్లెనా అద్భుతమైన పర్‌ఫార్మెన్స్‌ కనబరిచారని దర్శకుడు శుభసాయి వెంకట్‌ చెప్పారు.

తెలుగులో ఇప్పటివరకూ రానటువంటి విభిన్నమైన కాన్సెప్ట్‌ ఇదని హీరో కికు యనమల తెలిపారు. గొప్ప బాధ్యతతో ఈ సినిమా తీశానని, కథానుగుణంగా మంచిటీమ్‌ కుదిరిందని చిత్ర నిర్మాత దీప్తి నడిమింటి పేర్కొన్నారు. తనికెళ్ల భరణి, ఈశ్వరీరావు, గోపరాజు రమణ తదితరులు నటిస్తున్నారు. ఈ వేసవిలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రానికి కెమెరా: రామకృష్ణ, సంగీతం: శేఖర్‌చంద్ర, నిర్మాత: దీప్తి నడిమింటి, స్క్రిప్ట్‌, దర్శకత్వం: శుభసాయి వెంకట్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events