ఎన్నో రోజులుగా సినీ పెద్దలు వేచి చూస్తున్న రోజు రానే వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవడానికి చాలా కాలంగా టాలీవుడ్ ప్రముఖులు వేచి చూస్తున్నారు. చివరికి ఈ డేట్ సెప్టెంబర్ 4న ఖరారైంది. కొంతకాలంగా ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా కలిసేందుకు వీలుపడలేదు. చివరికి ఈ నెల 4న మీటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. జగన్ దగ్గరికి వెళ్లిన తర్వాత ఏ విషయాల గురించి చర్చించాలి అనే విషయంపై ఈ మధ్య చిరంజీవి ఇంట్లో కూర్చుని సినిమా పెద్దలంతా చర్చించిన విషయం తెలిసిందే.