తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగస్టు 2న నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. హాలియాలో నియోజకవర్గ ప్రగతి సమీక్షలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. సాగర్ ఉప ఎన్నికల సందర్భంగా బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ ఎన్నికల తర్వాత తాను నియోజకవర్గానికి వస్తానని ప్రకటించారు. దీనికి అనుగుణంగా తాజాగా సాగర్‌లో పర్యటించాలని ఆయన నిర్ణయించారు. ఆ రోజు సభలో ఇచ్చిన హామీల అమలుతో పాటు నియోజకవర్గ అభివృద్ధి, నాగార్జుసాగర్, హుజూర్‌నగర్, మిర్యాలగూడ పరిధిలోని ఎత్తిపోతల పథకాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.