Skip to main content

Namaste NRI

మాతో కలిసి రండి.. భారత్ పై అమెరికా ఒత్తిడి

ఉక్రెయిన్‌పై రష్యా చర్యలను అడ్డుకునేందుకు తమతో కలిసి రావాలని అమెరికా భారత్‌ను కోరింది. ఈ విషయమై భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ ఫోన్‌లో మాట్లాడారు. ఉక్రెయిన్‌ పై దాడిని ఖండిరచేందుకు బలమైన ఉమ్మడి స్పందన అవసరాన్ని గుర్తు చేశారు. ఉక్రెయిన్‌పై ముందస్తు ప్రణాళిక మేరకు దాడికి దిగిన రష్యా చర్యపై జైశంకర్‌తో బ్లింకెన్‌ మాట్లాడినట్టు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ మీడియాకు తెలిపారు. అమెరికా అధ్యక్షుడి కార్యాలయం, విదేశాంగశాఖ, జాతీయ భద్రతా మండలికి చెందిన అధికారులు భారత్‌లోనే ఆయా విభాగాల అధినేతలలతో సంప్రదింపులు చేస్తూనే వున్నారు. నిజానికి ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిరచే విషయంలో భారత్‌ వైఖరి పట్ల అమెరికా సంతోషంగా లేదు. ఇదే విషయాన్ని భారత్‌లో అధికారులకు అమెరికా అధికారులు తెలియజేసినట్లు సమాచారం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events