Skip to main content

Namaste NRI

కపుల్ ఫ్రెండ్లీ మూవీ సంతోష్ శోభన్ బర్త్‌డే గ్లింప్స్

సంతోష్‌శోభన్‌ కథానాయకుడిగా రూపొందుతోన్న లవ్‌ అండ్‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ కపుల్‌ ఫ్రెండ్లీ. అశ్విన్‌ చంద్రశేఖర్‌ దర్శకుడు. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న, వాలెంటైన్స్‌ డే కానుకగా సినిమాను విడుదల చేయనున్నారు. ఈ రోజు సంతోష్‌శోభన్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా స్పెషల్‌ గ్లింప్స్‌తోపాటు ఈ సినిమా టైటిల్‌ లుక్‌ను కూడా మేకర్స్‌ విడుదల చేశారు. టైటిల్‌ లుక్‌ని బట్టి ఇది చెన్నై నేపథ్యంలో సాగే ప్రేమకథ అని తెలుస్తున్నది. మానస వారణాసి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: దినేష్‌ పురుషోత్తమన్‌, సంగీతం: ఆదిత్య రవీంద్రన్‌, సహనిర్మాత: అజయ్‌కుమార్‌ పి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events